మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి... | Ninne Pelladatha song in Sakshi literature | Sakshi
Sakshi News home page

మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి...

Apr 2 2018 1:39 AM | Updated on Jul 21 2019 4:48 PM

Ninne Pelladatha song in Sakshi literature

పదం పలికింది – పాట నిలిచింది

ప్రేమికుల చూపు ఎంత తీక్షణంగా ఉంటుంది! ఎంత లోతుగా, ఎంత గాఢంగా ఉంటుంది! నిన్నే పెళ్లాడతా చిత్రం కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన– 
‘కన్నుల్లో నీ రూపమే 
గుండెల్లో నీ ధ్యానమే’ పాటలోని ఈ పంక్తి వ్యక్తపరుస్తుంది.
‘మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపు నాపేదెలా’ అంటుంది నాయిక. 
దీనికి కొనసాగింపుగా నాయకుడు అడిగే భావన కూడా అందమైనది. 
‘నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా’. 
దీనికి సంగీతం అందించింది సందీప్‌ చౌతా. గాయనీ గాయకులు చిత్ర, హరిహరన్‌. ఎందుకో ఇందులో చిత్ర గొంతు కొత్తగా వినిపిస్తుంది. 1996లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు కృష్ణవంశీ. అక్కినేని నాగార్జున, టాబు నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement