లవ్ లెటర్స్
కావలసినవి: మైదా పిండి - 2 కప్పులు; పంచదార - అర కప్పు; ఉప్పు - టీ స్పూను; బటర్ - కప్పు; నిమ్మతొక్కల తురుము - 2 టీ స్పూన్లు; కమలాపండు తొక్కల తురుము - టేబుల్ స్పూను; సోర్ క్రీమ్ - అర కప్పు; చెర్రీ ముక్కలు - కప్పు; పంచదార పొడి - 4 టీ స్పూన్లు
తయారీ: 475 డిగ్రీల ఫారెన్ హీట్ దగ్గర అవెన్‌ను ప్రీ హీట్ చేయాలి ఒక పాత్రలో మైదా పిండి, పంచదార, ఉప్పు వేసి కలపాలి బటర్, నిమ్మతొక్కల తురుము, కమలాపండ్ల తొక్కల తురుము వేసి బాగా కలపాలి సోర్ క్రీమ్‌ను గిలక్కొట్టి జత చేయాలి అన్నీ బాగా కలిపి చిన్న చిన్న ఉండలు చేయాలి ఒక్కో ఉండను ఒత్తి, ఎన్‌వలప్ కవర్‌లా మడిచి, మధ్య భాగంలో చెర్రీ ఉంచాలి బేకింగ్ షీట్ మీద ఒక్కో కవరును జాగ్రత్తగా ఉంచాలి పై భాగం మీద నీళ్లను బ్రష్ చేసి, పంచదార చల్లి, సుమారు ఎనిమిది నిమిషాలు బేక్ చేసి తీసేయాలి.
స్వీట్ హార్ట్
కావలసినవి: వైట్ కేక్ మిక్స్ - ఒక ప్యాకెట్; నీళ్లు - 1 + 1/4 కప్పులు; వెజిటబుల్ ఆయిల్ - 1/3 కప్పు; కోడిగుడ్లు - 3 (తెల్ల సొన మాత్రమే వాడాలి); రెడ్ ఫుడ్ కలర్ - 8 చుక్కలు; రాస్ప్‌బెర్రీ క్యాండీ ఆయిల్ - 2 చుక్కలు
తయారీ: అవెన్‌ను 350 డిగ్రీల ఫారెన్ హీట్ దగ్గర ప్రీ హీట్ చేయాలి మఫిన్ టిన్‌లో పేపర్ కప్ కేక్ లైనర్లు ఉంచాలి ఒక పాత్రలో కేక్ మిక్స్, నీళ్లు, వెజిటబుల్ ఆయిల్, కోడిగుడ్ల తెల్ల సొన వేసి బాగా గిలక్కొట్టాలి కప్ కేక్‌లో మూడు వంతుల మిశ్రమం వే సి పక్కన ఉంచాలి మిగిలిన మిశ్రమంలో నాలుగు చుక్కల రెడ్ ఫుడ్ కలర్ వేసి కలిపాక, రాస్ప్‌బె ర్రీ ఆయిల్ వేసి, 1/3 వంతు మిశ్రమంలో పింక్ రంగు మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేసి పక్కన ఉంచాలి మిగిలిన మిశ్రమంలో రెట్టింపు ఫుడ్ కలర్ నీళ్లు వేసి, మిశ్రమాన్ని మరో ప్లాస్టిక్ కవర్‌లో వేసి పక్కన ఉంచాలి లేత గులాబీ రంగు మిశ్రమం ఉన్న కవర్‌ను కోన్‌లా పట్టుకుని చివర్లు కట్ చేసి రెండు మిశ్రమాలను కప్ కేక్‌ల మధ్య భాగంలో రెండు టీ స్పూన్ల మిశ్రమం వచ్చేలా గట్టిగా పిండాలి ముదురు గులాబీ రంగులో ఉండే మిశ్రమం ఉన్న కవర్‌ను కూడా అదేవిధంగా కట్ చేసి టీ స్పూను మిశ్రమం వచ్చేలా గట్టిగా పిండాలి ఈ కప్ కేక్‌లను అవెన్‌లో ఉంచి సుమారు 20 నిమిషాల సేపు బేక్ చేసి బయటకు తీసి చల్లారనివ్వాలి ఫ్రిజ్‌లో ఉంచి కొద్దిగా చల్లబడ్డాక అందించాలి.
సుగర్ లిప్స్
కావలసినవి: బటర్ - ఒకటిన్నర కప్పులు; పంచదార - 2 కప్పులు; కోడిగుడ్లు - 4; వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ - టీ స్పూను; మైదా పిండి - 5 కప్పులు; బేకింగ్ సోడా - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత
తయారీ: ఒకపెద్ద పాత్రలో బటర్, పంచదార వేసి బాగా మెత్తగా క్రీమీగా అయ్యేవరకు గిలక్కొట్టాలి కోడిగుడ్లు, వెనిలా వేసి బాగా గిలక్కొట్టి, మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు మిశ్రమానికి జత చేసి బాగా కలిపి మూత పెట్టి ఫ్రిజ్‌లో ఒకరోజు రాత్రంతా ఉంచాలి అవెన్‌ను 400 డిగ్రీల ఫారెన్ హీట్ దగ్గర ప్రీ హీట్ చేయాలి ఫ్రిజ్‌లో నుంచి మిశ్రమాన్ని బయటకు తీసి, సుమారు పావు అంగుళం మందంగా ఒత్తి, కుకీ కటర్‌తో కావలసిన ఆకారంలో కట్ చేసి, అన్ గ్రీజ్‌డ్ కుకీషీట్ మీద ఉంచి, సుమారు ఎనిమిది నిమిషాలు వుంచి తీసి, చల్లారాక అందించాలి.
లవ్వు బువ్వ
Published Fri, Feb 13 2015 10:33 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..
ఓటరు జాబితాలో పేరు తొలగించినా ఓటేయవచ్చు !
ఒకసారి తిరిగి చూసుకోండి..
పార్టీలు మారుతున్న అభ్యర్థులు.. ఎంపీలను మార్చేస్తున్న ఓటర్లు!
అలాంటి పాటలంటే నాకు ఇష్టం లేదు.. కానీ: సుకుమార్
వెస్ట్ నైలు వైరస్‌ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
రాయల్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో ఢిల్లీ!
SRH Vs LSG: ప్లే ఆఫ్స్ రేసు.. రెండింటికీ కీలక మ్యాచ్
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం.. మండిపడ్డ బీజేపీ
ఇదే మరి మ్యాజిక్ అంటే.. 'జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్'
తప్పక చదవండి
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
- వెస్ట్ నైలు వైరస్‌ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్‌గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- హైదరాబాద్‌లో విషాదం.. ఏడుగురు మృతి
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement