జపాన్ మహిళ జీవనశైలి భేష్! | Japan woman Lifestyle | Sakshi
Sakshi News home page

జపాన్ మహిళ జీవనశైలి భేష్!

Mar 18 2015 12:02 AM | Updated on Sep 2 2017 10:59 PM

జపాన్ మహిళ జీవనశైలి భేష్!

జపాన్ మహిళ జీవనశైలి భేష్!

సగటు భారతీయ మహిళకి ఇల్లే ప్రపంచం...

సగటు భారతీయ మహిళకి ఇల్లే ప్రపంచం. ఇంటి పనులు, కుటుంబ బాధ్యతల్లో పడి చివరికి తన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం కూడా మర్చిపోతుంది. అందుకేనేమో... ఇటీవల 190కి పైగా దేశాల్లో మహిళల జీవన ప్రమాణాల మీద జరిపిన పరిశోధనలో, తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే మహిళల జాబితాలో మొదటి వరుసలో ఉంది. అదే సమయంలో... ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తోన్నవారిలో జపాన్ మహిళ మొదటి స్థానంలో నిలిచింది.

ఆ దేశ మహిళల ఆయుఃప్రమాణం ఎనభయ్యేళ్ల పైనే. వారు అంతకాలం ఆరోగ్యంగా ఎలా జీవిస్తున్నారు అని ఆలోచిస్తోన్న సమయంలో, కొన్నాళ్ల క్రితం నవోమీ మొరియామా రాసిన ‘జపాన్ ఉమెన్ డోన్ట్ గెట్ ఓల్డ్ ఆర్ ఫ్యాట్’ పుస్తకం ప్రస్తావన వచ్చింది. జపాన్ మహిళల జీవనశైలి గురించి, ఆరోగ్య రహస్యాల గురించి నవోమీ ఎంతో పరిశీలించి, పరిశోధించిన రాసిన ఆ పుస్తకాన్ని అందరూ చదవాలి. ఆ విషయాలను పాటించి తీరాలి. ఇవే ఆ సంగతులు...
జపాన్ మహిళలు తమ వంటింట్లో ఆరోగ్యానికి చెడు చేసే దినుసులు ఉంచరట. అంటే మసాలాల వంటివన్నమాట  వాళ్లు తప్పనిసరి అయితే తప్ప బయటి ఆహారాన్ని తినరట 
మిగిలింది ఫ్రిజ్‌లో పెట్టడం, తర్వాత తీసి వడ్డించడం చేయరట. అలాగే కూరగాయలు, చేపలు, మాంసం వేటినీ కాస్త నిల్వయినా కొనరట 
మ్యాగ్జిమమ్ బ్రౌన్ రైసే ఉపయోగిస్తారట  మనలాగ అన్నం, ఏదో ఒక కూర వండరట. ఓ సలాడ్, జ్యూస్, బ్రౌన్ రైస్, ఒకట్రెండు కూరలు... ఇలా రకరకాలు వండుతారట. అన్నీ కొద్దికొద్దిగా తినడం, ఆరోగ్యకరమైనవే తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరగదు 
వేపుళ్లవీ చేయరట. ఆవిరి మీద ఉడికించినవి, గ్రిల్ చేసినవి అంటే కాల్చినవి తింటారట 
రాత్రి భోజనం తక్కువగా, మధ్యాహ్న భోజనం ఓ మాదిరిగా, ఉదయం పూట ఆహారం మాత్రం ఎక్కువగా తీసుకుంటారట. ఉదయాన గ్రీన్ టీ, స్టీమ్డ్ రైస్, సూప్, ఆమ్లెట్, గ్రిల్డ్ ఫిష్ అంటూ రకరకాలు తింటారు. రోజంతా బలమూ ఉంటుంది. పనుల్లో పడి సాయంత్రానికల్లా అరిగిపోతుంది. కాబట్టి శరీరంలో కొవ్వు నిల్వలు పెరగవు
తీపి పదార్థాలకు శుభ సమయాల్లో తప్ప దైనందిన ఆహారంలో చోటు కల్పించరట  ఏ ఒక్కరూ పొర పాటున కూడా వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయరట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement