స్టేట్‌మెంట్ సదానందం గారి పొంతన లేని చింతన! | I thought sadanandam Statement bad! | Sakshi
Sakshi News home page

స్టేట్‌మెంట్ సదానందం గారి పొంతన లేని చింతన!

Jun 3 2014 11:52 PM | Updated on Sep 2 2017 8:16 AM

స్టేట్‌మెంట్ సదానందం గారి పొంతన లేని చింతన!

స్టేట్‌మెంట్ సదానందం గారి పొంతన లేని చింతన!

‘‘ఆడదానికి అందంతో పని. మగాడికి పనే అందం’’ ఇదీ స్టేట్‌మెంట్ సదానందం తాలూకు ఒక గొప్ప కొటేషన్.

ఉత్త(మ)పురుష
‘‘ఆడదానికి అందంతో పని. మగాడికి పనే అందం’’ ఇదీ స్టేట్‌మెంట్ సదానందం తాలూకు ఒక గొప్ప కొటేషన్. అలవోకగా, ఆశువుగా కొట్టొచ్చినట్టు కొటేషన్స్ ఇస్తుంటాడు కాబట్టి సదానందాన్ని అందరూ స్టేట్‌మెంట్ సదానందం అంటుంటారు. పైది ఆయన వెలువరించిన స్టేట్‌మెంట్లలో ఒక గొప్ప కొటేషన్. అయితే విచిత్రం ఏమిటంటే... సదానందం భార్య తాలూకు కాస్మటిక్స్ అన్నీ త్వరత్వరగా అయిపోతుండటం, అవి నిండుకోడానికి పట్టే వ్యవధి రోజురోజుకూ తరిగిపోతుండటంతో అబ్బురపడుతోంది సుమతి.

ఒకరోజు ఆ మిస్టరీ విడిపోయింది. కారణం తన మిస్టరేనని తేలిపోయింది. అర్ధరాత్రుళ్లు లేచి ఆమె కాస్మటిక్స్‌ను రహస్యంగా రాసుకుని మళ్లీ పడుకునే పని పెట్టుకున్నాడు సదానందం. అదేంటంటే... ఆడవాళ్లను అంతగా ఆకర్షించే అంశం ఏముందో చూసే ‘పని’ పట్టుకున్నాను. అందుకే ఈ ‘పని’ అంటూ మేకప్ చేశాడా మొగుడు. అలాంటిదే మరో ఘటన.
       
 ‘‘లోకంలోని తెలివితక్కువ వాళ్ల మెదళ్ళలో ఏం పెట్టాలో తెలియలేదు బ్రహ్మకు. అందుకే వాళ్ల తలపై వెంట్రుకలు మొలిపించి, వాటి తాలూకు వేరు మెదళ్లలోని ఖాళీ స్థలాన్ని ఆక్రమించేలా చేశాడు. అదే తెలివిగల వాడి మెదడు పూర్తిగా చురుగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ల తలపై వెంట్రుకలే నిలబడలేకుండా చేశాడు’’ అంటూ పెద్ద స్టేట్‌మెంటొకటి ఇచ్చాడు సదానందం. ఇలా అన్నవాడు తన మాటకు కట్టుబడి ఉండాలా, వద్దా? మళ్లీ తానే రాత్రంతా జట్టు మొలిపిస్తామంటూ గంటలకొద్దీ నడుస్తూ  ఊదరగొట్టే టీవీ యాడ్స్ చూస్తూ, వాటిని రహస్యంగా తెప్పించుకుని, అర్ధరాత్రి లేచి వాటిని తలకుపట్టిస్తూ, తలగడకు పామేస్తూ  ఉంటాడు.
       
 ‘‘నా భర్తది నాలుక కాదు... అదో విలువైన డబ్బు నాణెం’’ అంది సుమతి. ‘‘అబ్బ ఈ కొటేషన్‌తో నా భార్యవనిపించావు. స్టేట్‌మెంట్ సదానందం సతీమణా, మజాకా’’ అన్నాడా భర్త.
 ‘‘అవునండీ... నాణేనికీ రెండు పార్శ్వాలూ... మీ నాల్కకూ రెండు సైడ్లు. టాస్ విసిరినట్టుగా మాటను గాల్లోకి ఎగరేయడం మీ పని. అదే సైడు పడుతుందన్నది అచ్చం మీ ఆచరణ లాంటిది. ఎంతైనా మీరు ద గ్రేట్ కొటేషన్ కింగ్ అయిన  స్టేట్‌మెంట్ సదానందం కదా’’ అంది సుమతి.      
                         - వై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement