గుండె కండరాలను బలపరిచే జెల్‌!

Heart muscle strengthening gel - Sakshi

పరి పరిశోధన

లబ్‌డబ్‌మని కొట్టుకునే మన గుండెకో ప్రత్యేకత ఉంది. దాని కణాలు ఒకసారి దెబ్బతింటే మళ్లీ ఉత్పత్తి కావు. అందుకే గుండెపోటు వచ్చినప్పుడు దాని కండరాల్లో కొంతభాగం దెబ్బతిని బలహీనపడుతుంది. ఫలితంగా శరీరానికి తక్కువ రక్తం అందుతుంది. అయితే ఈ పరిస్థితి త్వరలో మారిపోనుంది. పెన్సెల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దెబ్బతిన్న గుండె కణాలను పునరుత్పత్తి చేయగల సరికొత్త పద్ధతిని అ¯భివృద్ధి చేశారు. రైబో న్యూక్లియక్‌ యాసిడ్‌ల (ఆర్‌ఎన్‌ఏ) అని పిలిచే సూక్ష్మ జన్యుక్రమ భాగాలను చిక్కటి ద్రవం (జెల్‌) రూపంలో గుండెకు నేరుగా అందించడం ద్వారా గుండె కణాలను పునరుత్పత్తి చేయగలమని వీరు ఎలుకలపై జరిపిన ప్రయోగాల ద్వారా నిరూపించారు.

ఈ ఆర్‌ఎన్‌ఏ పోగులు గుండె కండరాల్లో మిగిలిన ఉన్న కార్డియోమయోసైట్‌ కణాల్లో పునరుత్పత్తి సంకేతాలను నిలిపివేసే యంత్రాంగంపై ప్రభావం చూపడం వల్ల ఇది సాధ్యమవుతోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మైక్రో ఆర్‌ఎఎన్‌ఏల ద్వారా కొన్ని రకాల జబ్బులకు చికిత్స అందించేందుకు గతంలోనూ ప్రయత్నం జరిగినప్పటికీ ఎంత మోతాదులో వీటిని వాడాలో స్పష్టం కాకపోవడం వల్ల అవి పెద్దగా ఫలితం చూపించలేదు. అయితే పెన్సెల్వేయా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆర్‌ఎన్‌ఏలను గుండెకు చేర్చగల జెల్‌కు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటే ఈ సమస్యను అధిగమించవచ్చునని పరిశోధనలు మొదలుపెట్టారు. ఎలుకలపై జరిపిన పరిశీలనల్లో కార్డియో మయోసైట్స్‌ సంఖ్య పెరిగినట్లు తేలడం వీరికి ఉత్సాహాన్నిచ్చింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top