నిగారింపు ఇలా సొంతం | To Get Rid Of Dust Easily You Need To Clean The Face With A Face wash | Sakshi
Sakshi News home page

నిగారింపు ఇలా సొంతం

Sep 21 2019 1:15 AM | Updated on Sep 21 2019 1:15 AM

To Get Rid Of Dust Easily You Need To Clean The Face With A Face wash - Sakshi

చర్మ సంరక్షణకు ఏ సౌందర్య ఉత్పాదనలు వాడాలనే సందేహం చాలా మందికి ఉంటుంది. కానీ, ఇంట్లో రోజూ తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలతోనే చర్మం నిగారింపును కాపాడుకోవచ్చు.

►కళ్ల కింద ఉబ్బు, వలయాలు ఏర్పడటం వంటివి గమనిస్తే.. రాత్రి పడుకునే ముందు వేలితో తేనె అద్దుకొని కళ్ల కింద ఉబ్బుగా ఉన్న చోట రాయాలి. అలాగే ముఖమంతా తేనె రాసి, మృదువుగా రుద్దాలి. తేనె మరీ జిడ్డుగా అనిపిస్తే టీ స్పూన్‌ నీళ్లు కలిపి రాయాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేస్తే చర్మకాంతి పెరుగుతుంది.

►రోజూ రాత్రి పడుకునే ముందు ఆలివ్‌ ఆయిల్‌లో ముంచిన దూది ఉండతో ముఖమంతా రాయాలి. అదే ఉండతో కాస్త ఒత్తిడి చేస్తూ మసాజ్‌ చేయాలి. దీంతో ముఖంపైన దాగున్న దుమ్ము కణాలు, శుభ్రపరిచినా మిగిలిన మేకప్‌ డస్ట్‌ సులువుగా వదిలిపోతుంది. ఆ తర్వాత ముఖాన్ని ఫేస్‌వాష్‌తో శుభ్రపరుచుకొని మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మం నిగారింపు పెరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement