
వద్దంటే కొవ్వు
ఒంట్లో కొవ్వు ఎక్కువైతే నానా జబ్బులు చుట్టుముడతాయనేది తెలిసిందే.
మెడిక్షనరీ
ఒంట్లో కొవ్వు ఎక్కువైతే నానా జబ్బులు చుట్టుముడతాయనేది తెలిసిందే. అందుకే చాలామంది ఆచి తూచి తింటుంటారు. ఒంట్లో కాస్తంత కొవ్వు అదనంగా చేరినా దానిని కరిగించుకునేందుకు నానా తంటాలు పడతారు. అతిగా తినడం వల్ల, ముఖ్యంగా కొవ్వులతో కూడిన పదార్థాలు మితిమీరి తినడం వల్ల శరీరంలోకి కొవ్వులు చేరి స్థూలకాయులుగా మారతారని తెలిసిందే.
చాలామంది విషయంలో ఇది నిజమే. కానీ అరుదుగా కొందరి విషయంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్లు ఎంత ఆచి తూచి తింటున్నా, ఒంట్లో కొవ్వు పేరుకుపోతూనే ఉంటుంది. అంటే, వాళ్లు తినే ఆహారంలో ఎక్కువ భాగం కొవ్వుగా రూపాంతరం చెందుతుంది. వాళ్లు ఎంత ఆయాసపడ్డా ఆ కొవ్వు ఒక పట్టాన కరగదు. జన్యు లోపం వల్ల తలెత్తే ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో ‘హైపర్ కొలెస్టరోలీమియా’ అంటారు.