ఈ కత్తుల్లో ఉన్నది గ్రహాంతరాల పదార్థం! 

Elite fighters in the Bronze Age forged their weapons from iron made of METEORITES - Sakshi

గ్రహాంతర వాసులు ఉన్నారా? అంటే లేరని ఠకీమని సమాధానం చెబుతాంగానీ.. కొన్ని విషయాలు మనల్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూంటాయి. ఫొటోలో కనిపిస్తున్న కత్తుల్నే ఉదాహరణగా తీసుకుందాం. ఎప్పుడో కొన్ని వేల ఏళ్ల క్రితం ఈజిప్టు రాజు టుటన్‌ఖమూన్‌ వాడినదట ఇది. గత ఏడాదే దీన్ని ఎక్స్‌ రేలతో విశ్లేషించారు. దీన్నిబట్టి ఇది ఈ భూమ్మీది లోహమైతే కాదని తేల్చేశారు. అవునా? మరి ఎక్కడి నుంచి వచ్చింది? అని మనమంతా తలలు బద్దలు కొట్టుకుంటూ ఉంటే ఫ్రాన్స్‌ శాస్త్రవేత్తలు తాజాగా ఇంకో బాంబు పేల్చారు. టుటన్‌ఖమూన్‌ ఖడ్గం మాత్రమే కాదు.. సుమారు 3300 ఏళ్ల క్రితం నాటి కంచుయుగపు ఈజిప్టు, కొన్ని ఇతర దక్షిణాసియా దేశాల్లో లభించిన చాలా వస్తువులు కూడా ఈ గ్రహానికి చెందినవి కావని అంటున్నారు.

కంచుయుగం నాటి ఆయుధాల్లో రాగిని తుత్తునాగం, ఆర్సినిక్‌ వంటి లోహాలను కలిపితే వచ్చే కంచుతో తయారయ్యేవని మనకు తెలుసు. ఈ కాలంలో ఇనుముతో చేసిన వస్తువులు చాలా అరుదు. ముడి ఇనుమును అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద కరిగించాల్సి రావడం దీనికి ఒక కారణం. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానమూ అప్పట్లో అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌కు చెందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు టుటున్‌ఖమూన్‌ ఖడ్గంతోపాటు కొన్ని ఇతర వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించారు. దీనిద్వారా తేలిందేమిటంటే... ఈ పురాతన వస్తువుల్లో వాడిన ఇనుము.. గ్రహాంతరాళాల నుంచి వచ్పిపడిన ఉల్కాశకలాలకు సంబంధించినదీ అని! 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top