
ఎక్కడో చూసినట్లుందా ఈ అమ్మాయిని! తెలుగమ్మాయి కనుక సహజంగానే మనకు అలా అనిపిస్తుంది. అనిపించడం కాదు లెండి, చూసే ఉంటారు.. ‘అంతకుముందు, ఆ తర్వాత’ చిత్రంలో అనన్య తను. ‘బందిపోటు’లో జాహ్నవి. ‘అమీతుమీ’లో దీపిక. ‘దర్శకుడు’లో నమ్రత. ‘బ్రాండ్ బాబు’లో రాధ. ‘అరవింద సమేత వీర రాఘవ’లో సునంద. అసలు పేరు ఈషా రెబ్బా! హైదరాబాద్ అమ్మాయి.
ఇప్పుడీ అమ్మాయి.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్న సినిమాలో కనిపించబోతోంది. హీరోయిన్‌గా కాకపోవచ్చు. అయినా చిరంజీవితో కలిసి నటిస్తే వచ్చే స్టార్‌డమ్ కన్నా హీరోయిన్ అవడం ఏమంత ఎక్కువని?! ‘సైరా’ తర్వాత చిరంజీవి నటించబోతున్న ఆ కొత్త సినిమా సోషల్ డ్రామా అంటున్నారు. నిర్మాత.. రామ్ చరణ్.