వేలి కొసల్లో మెరుపు | Designer bags | Sakshi
Sakshi News home page

వేలి కొసల్లో మెరుపు

Feb 5 2014 11:58 PM | Updated on Sep 2 2017 3:22 AM

వేలి కొసల్లో మెరుపు

వేలి కొసల్లో మెరుపు

పార్టీకి వెళ్లడానికి మేకప్, డిజైనర్ దుస్తులు అన్నీ చక్కగా అమరాయి. మరి హ్యాండ్ బ్యాగ్?! అది కూడా చూడముచ్చటగా ఉండాలి...

పార్టీకి వెళ్లడానికి మేకప్, డిజైనర్ దుస్తులు అన్నీ చక్కగా అమరాయి. మరి హ్యాండ్ బ్యాగ్?! అది కూడా చూడముచ్చటగా ఉండాలి... అని ఆలోచించేవారి మనసును ఇట్టే దోచేసే డిజైనర్ బ్యాగ్స్ ఇవి. వేళ్లతో ముచ్చటగా పట్టుకోవడానికి వీలుగా ఉండే వీటిని చిన్న పర్సులుగా కూడా వాడచ్చు. బ్లాక్ బ్రాస్ మెటీరియల్‌తో రూపొందించి, 24 క్యారెట్ల బంగారంతో కోటింగ్ ఇచ్చారు.

చుట్టూ మువ్వలు, కుందన్స్, స్టోన్స్‌తో మరిన్ని హంగులను పొదిగారు. సంప్రదాయ దుస్తులకు చక్కగా అమరే ఈ బుజ్జి హ్యాండ్‌బ్యాగ్‌లో సెల్‌ఫోన్, డబ్బులూ పెట్టుకోవడానికి వీలుగా లోపల సిల్క్ క్లాత్‌ను పర్‌‌సగా ఉపయోగించారు. కలకత్తాలోని సంప్రదాయ ఆభరణాల సంస్థ ‘క్రితి’ వీటిని రూపొందించింది. ఇటీవల హైదరాబాద్ ఫ్యాషన్ ఎక్స్‌పోలో ఇవి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఒక్కో బ్యాగ్ ధర: రూ.5000/-
 

- కవిత ఫుంభర, డిజైనర్ www.facebook.com/kriti.jewelry
 

Advertisement
 
Advertisement
Advertisement