చాక్లెట్...తినడానికే కాదు..! | Chocolate not only for eat | Sakshi
Sakshi News home page

చాక్లెట్...తినడానికే కాదు..!

Sep 16 2015 4:07 AM | Updated on Sep 3 2017 9:27 AM

చాక్లెట్...తినడానికే కాదు..!

చాక్లెట్...తినడానికే కాదు..!

చాక్లెట్ తినడానికే కాదు... ముఖారవిందానికి కూడా బాగా పనికొస్తాయి. అదెలాగో చూడండి!

► చాక్లెట్ తినడానికే కాదు... ముఖారవిందానికి కూడా బాగా పనికొస్తాయి. అదెలాగో చూడండి!
► చాక్లెట్ పొడిలో తగినన్ని నీళ్లు పోసి వేడి చేయాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు, పాలు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి.  బయట నుంచి ఇంటికి చేరుకున్న వెంటనే ఈ మిశ్రమం తో స్క్రబ్ చేసుకుంటే ముఖం, మెడ, చేతులు, పాదాలు కాంతివంతంగా తయారవుతాయి. ఉప్పు మృతకణాలను తొలగిస్తుంది. మిగతా పదార్థాలు ముఖాన్ని అందంగా మారుస్తాయి.
► మొటిమలు, వాటివల్ల ఏర్పడే మచ్చలతో బాధపడేవారు టీ ట్రీ ఆయిల్‌తో మంచి ఫలితం పొందవచ్చు. రోజు విడిచి రోజు ముఖానికి ఆ ఆయిల్ రాసుకొని రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోండి. ఇది వాడేటప్పుడు వేరే క్రీములు వాడకపోవడం మంచిది. ఇలా చేస్తే మచ్చలను దూరం చేయడంతో పాటు మొటిమలు రావడాన్నే అరికడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement