భద్రం.. బీ కేర్‌ఫుల్‌ సిస్టరు.. స్మార్ట్‌ ఫోన్‌ చాలా డేంజరు!

Bee Careful Cysturasmart phone is very danger - Sakshi

నమ్య! చెన్నై బ్లాగర్‌. ఉద్యోగం కోసం నెట్‌లో సెర్చ్‌ చేస్తోంది.  తెలిసిన వాళ్లకు కూడా తన ఫోన్‌ నెంబర్‌ ఇచ్చింది. ఇటీవలే, ఆమెకు ‘ఎయిర్‌ ఫ్రాన్స్‌’ నుంచి కాల్‌ వచ్చింది! ‘‘ఇంతక్రితమే మా ఎగ్జిక్యూటివ్‌ మీ వివరాలు చెప్పాడు. ఫార్మాలిటీస్‌ ఏమీ లేవు. వాట్సాప్‌ వీడియో కాల్‌లో ఇంటర్వ్యూ ఉంటుంది’ అని చెప్పాడు. వీడియో కాల్‌ ఇంటర్వ్యూ మొదలైంది.  మీ ఎత్తు, బరువు చూపించండి. మీ ఒంటిమీద పుట్టు మచ్చలు చూపించండి.  మీ పొట్టభాగం చూపించండి.. ఇలా ఉన్నాయి ప్రశ్నలు. నమ్యకు డౌట్‌ వచ్చింది.  ‘సారీ.. నేనలా చేయలేను’ అంది నమ్య. ‘‘ఇప్పుడున్న బట్టలతో పొట్టను చూపించడానికి వీలుకాకపోతే టీషర్ట్‌ వేసుకోండి’’ అన్నాడు! నమ్యకు ఇందంతా సవ్యంగా సాగుతున్నట్లేం అనిపించలేదు.

వెంటనే కాల్‌ కట్‌ చేసింది. ఆమెకు అర్థమైంది. అది ఎయిర్‌ ఫ్రాన్స్‌ నుంచి వచ్చిన కాల్‌ కాదు, ఎవరో ఆ పేరుతో తనని ట్రాప్‌ చేస్తున్న కాల్‌ అని.  వెంటనే ఆ వాట్సాప్‌ చాట్‌ని ఫేస్‌బుక్‌లో పెట్టింది నమ్య. ఆగంతకుడి కోసం హంట్‌ మొదలైంది! ఇక్కడితో ఆగిపోలేదు నమ్య. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎలాంటి ప్రమాదాలు ఎదురౌతాయో తెలుపుతూ జనవరి 3న ఒక లెటర్‌ పోస్ట్‌ చేసింది. ‘గర్ల్స్‌.. మనం డేంజర్‌లో ఉన్నాం. నాకు జరిగినట్లు మీకెవరికీ జరగకూడదు. ఫోన్‌లో కేర్‌ఫుల్‌గా ఉండండి’ అని రాసింది. సో.. అమ్మాయిలూ.. జాగ్రత్త! మీ చేతిలోని స్మార్ట్‌ఫోనే ఒక్కోసారి మీ శత్రువు అవుతుంది.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top