బంగారు దుంప

beauty tips - Sakshi

ఇల్లే పార్లర్‌

బ్యూటీ

నెలరోజులకు ఒకసారైనా పార్లర్‌కి వెళ్లి ఫేసియల్‌ చేయించుకోవడం సాధారణమైన విషయం. మృతకణాలు, ట్యాన్, జిడ్డు తగ్గిపోయి ముఖ చర్మం తాజాగా ఉండాలంటే నేచురల్‌ పద్ధతిలో ఇంట్లోనే ఫేసియల్‌ చేసుకోవచ్చు. పచ్చి బంగాళదుంప రసాన్ని ఉపయోగించి చేసే ఈ పద్ధతి వల్ల ముఖం మీద మచ్చలు, పిగ్మెంటేషన్‌ తగ్గడమే కాకుండా చర్మం బంగారంలా మెరుస్తుంది.

తయారీ 
►2 బంగాళదుంపలు (తురమాలి) 
► ఈ తరుగును మిక్సీలో వేసి బ్లెండ్‌ చేయాలి. 
►పిడికి ట్లో బంగాళదుంప గుజ్జు పట్టుకొని గట్టిగా వత్తితే రసం వస్తుంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఈ రసాన్ని వడకట్టుకోవాలి. 

స్టెప్‌:01 క్లెన్సింగ్‌ 
►ఒక గిన్నెలో టీ స్పూన్‌ బంగాళదుంప రసాన్ని తీసుకోవాలి. టీ స్పూన్‌ రోజ్‌ వాటర్‌ వేసి కలపాలి. 
►దూది ఉండను పై మిశ్రమంలో ముంచి బుగ్గలు, చుబుకం, కనుల కింద, నుదురుభాగం, మెడ భాగం.. ఇలా ముఖమంతా తుడవాలి. 
►2 నిమిషాలు వదిలేసి చల్లని నీళ్లతో కడిగేయాలి. 
► 5 నిమిషాలు ఆవిరి పట్టాలి. దీంతో పోర్స్‌లో మురికి, జిడ్డు వదిలిపోతాయి.

స్టెప్‌ :02 మలినాల తొలగింపుకు పోర్స్‌ని అలాగే వదిలేయకుండా సహజపద్ధతిలో ముఖకాంతి పెంచాలంటే..టీ స్పూన్‌ బియ్యప్పిండి, టీ స్పూన్‌ తేనె, టీ స్పూన్‌ బంగాళదుంప రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 3 నుంచి 4 నిమిషాలు మృదువుగా వేళ్లతో వలయాకారంగా స్ట్రోక్స్‌ ఇస్తూ మసాజ్‌ చేయాలి. తర్వాత మళ్లీ ముఖాన్ని నీటితో కడిగేయాలి. దీని వల్ల చర్మంపై మలినాలు తొలగిపోతాయి.

స్టెప్‌: 03 ఫేసియల్‌ మసాజ్‌
కలబంద రసం, బంగాళదుంప రసం సమపాళ్లలో తీసుకొని దీంట్లో ఏదైనా మసాజ్‌ క్రీమ్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కిందనుంచి పైకి వేళ్లతో గుండ్రంగా మసాజ్‌ చేయాలి. ఇలా 5 నిమిషాలు చేసిన  తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల చర్మం మృదువుగా అవుతుంది.

స్టెప్‌:04 ఫేస్‌ ప్యాక్‌ ∙టీ స్పూన్‌ బంగాళదుంప రసంలో 4–5 చుక్కల నిమ్మరసం, 2 టీ స్పూన్ల పాలు, టీ స్పూన్‌ గంధంపొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేసియల్‌ బ్రష్‌తో అద్దుకుంటూ ముఖమంతా రాయాలి. 20 నిమిషాలు వదిలేయాలి. తర్వాత కడిగేయాలి.  బంగాⶠదుంపలో ఉండే ‘సి’ విటమిన్‌ చర్మం మలినాలను తొలగిస్తుంది. జీవం లేని చర్మానికి కాంతిని తెస్తుంది. వయసు కారణంగా వచ్చే ముడతలను నివారిస్తుంది. పొడిబారడం వంటి సమస్య కూడా తగ్గిపోతుంది. 15 రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటే చర్మం తాజాదనం కోల్పోదు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top