లోగిలి | artistic drawing room is not just home | Sakshi
Sakshi News home page

లోగిలి

May 2 2017 11:52 PM | Updated on Sep 5 2017 10:13 AM

లోగిలి

లోగిలి

కళాత్మకంగా ఉండే డ్రాయింగ్‌ రూమ్‌ ఇంటి అందానికే కాదు,

ఆనందం

కళాత్మకంగా ఉండే డ్రాయింగ్‌ రూమ్‌ ఇంటి అందానికే కాదు, మనోల్లాసానికి కూడా దోహదం చేస్తుంది. హాల్‌లో సీటింగ్, మ్యూజిక్‌ సిస్టం, టీవీ, వాల్‌హ్యాంగింగ్స్, లైటింగ్‌ సిస్టమ్, తివాచీలు ఎలా అమరిస్తే అందంగా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. మీ ఇంటికి వచ్చిన అతిథులు మీరు గోడలకు అమర్చిన పెయింటింగ్స్‌ చూసి... వాటిని ఎక్కడ కలెక్ట్‌ చేశారని అడిగేలా వాటి కళాత్మకత ఉండాలి. ఇంట్లో రూముల గురించి మాత్రమే కాక పోర్టికో, ఇంటి ముందు ఉండే ఖాళీ ప్రదేశంలో ఇంటి వెనుక పెంచే మొక్కలు ఊయల గురించి కూడా కొంచెం శ్రద్ధ తీసుకోండి.   మీ ఇంటి వరండాలోనూ ఇంటిముందు ఉన్న ఖాళీ ప్రదేశంలోనూ పెంపుడు జంతువుల కొరకు కేజ్‌లు ఏర్పాటు చేయండి. పక్షుల కోసం నీటి గిన్నెలు, కొన్ని గింజలు పెట్టండి.
     
ఇంటిని ప్రశాంతనిలయంలా తీర్చిదిద్దడానికి ఇంల్లోని ప్రతి గది కొలతలు మీకు క్షుణ్నంగా తెలిసి ఉండాలి. అప్పుడే అలంకరణ విషయంలో స్పష్టమైన అవగాహన వస్తుంది. ప్రతిగదిలోనూ ఏదో ఒక ప్రాంతం ఫోకస్‌ పాయింట్‌లా ఉండాలి. అందుకు ప్రతి గదిలోనూ ఒక ప్రదేశంలో మీ అభిరుచికి తగినట్లు ప్రత్యేకమైన శిల్పాలు చిన్న పిల్లల బొమ్మలు లైటింగ్‌ టేబుల్స్, షాండ్లియర్, ఫ్లవర్‌ పాట్స్‌ అమర్చండి. చూసిన వెంటనే ఆకట్టుకునే విధంగా... గదిలో అమర్చిన లైటింగ్‌ ఆ గది అందాన్ని మరింత ఇనుమడింపచేస్తుంది. మీ గది రంగును రిఫ్లెక్ట్‌ చేసే విధంగా బల్బులను అమర్చండి. మీరు అమర్చిన లైటు కింద చక్కటి రౌండ్‌ టేబుల్‌ వేసి దానిమీద ఫ్లవర్‌బేసిన్‌ను పెట్టండి. రంగురంగుల డిజైన్లలో ఉండే బేసిన్‌లో నీళ్లు పోసి దాని పై రంగురంగుల అందమైన పూలను అమర్చండి.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement