రాజుగారు ఇంటికొచ్చారు

Abu Dhabi Prince Visits Little Girl After He Missed Her Handshake - Sakshi

చిన్నారులు మనసు చిన్నబుచ్చుకుంటే పెద్దవాళ్ల ప్రాణం ఉసూరుమంటుంది. చిన్నబుచ్చింది తామే అని తెలిస్తే వెళ్లి ఊరడించేవరకు ఊరుకోరు. షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ పెద్ద మనిషి మనిషి మాత్రమే కాదు, అబుదాబికి యువరాజు కూడా! అంతటి మనిషి తనకు తెలియకుండానే ఓ బాలిక మనసు నొప్పించారు. ఓ విందు కార్యక్రమానికి ఆయన హాజరు అవుతున్నారని తెలిసి ఆయనకు స్వాగతం పలికేందుకు కొందరు చిన్నారులను ఎంపిక చేశారు నిర్వాహకులు.ఆ పిల్లలందర్నీ పలకరిస్తూ ముందుకు వెళుతున్న యువరాజు వారిలోని ఒక చిన్నారి చాచిన స్నేహ హస్తాన్ని గమనించకుండానే అక్కడి నుంచి నిష్క్రమించారు. తర్వాత ఆ వీడియో వైరల్‌ అయి యువరాజు వరకు వచ్చింది. వెంటనే ఆయన ఆ బాలిక ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి ఆప్యాయంగా కరచాలనం చేశారు. అంతేకాదు. బాలిక నుదుటిపై ముద్దు కూడా పెట్టారు. ఇక చూడండి.. ఆ పాప ఆనందం, ఆ ఇంటి ఆనందం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top