నలుగురు ఆడపిల్లలు 300 కోట్లు | 300 crore in four girls | Sakshi
Sakshi News home page

నలుగురు ఆడపిల్లలు 300 కోట్లు

Dec 27 2016 11:52 PM | Updated on Sep 4 2017 11:44 PM

ఫాతిమా సనా, ఆమిర్‌ ఖాన్, సాక్షి తన్వర్, సాన్యా మల్హోత్రా

ఫాతిమా సనా, ఆమిర్‌ ఖాన్, సాక్షి తన్వర్, సాన్యా మల్హోత్రా

‘దంగల్‌’ సినిమా రేపో మాపో 300 కోట్ల క్లబ్‌లోకి చేరబోతోంది. తెర మీద, తెర వెనుక నలుగురు ఆడపిల్లలు సాధించిన విజయం ఇది.

విజయం

‘దంగల్‌’ సినిమా రేపో మాపో 300 కోట్ల క్లబ్‌లోకి చేరబోతోంది. తెర మీద, తెర వెనుక నలుగురు ఆడపిల్లలు సాధించిన విజయం ఇది. అఫ్‌కోర్స్‌... సూత్రధారిగా ఆమిర్‌ ఖాన్‌ ఉన్నాడనుకోండి. ‘దంగల్‌’ విడుదలయ్యి సరిగ్గా ఐదు రోజులు అవుతోంది. ఈ లోపే కలెక్షన్లు 200 కోట్లు దాటాయి. సాధారణంగా సోమవారం కలెక్షన్‌ డల్‌గా ఉంటుంది. కాని దంగల్‌ సోమవారం 25 కోట్లు సాధించింది. నిజజీవితంలో గీతా, బబిత అనే ఇద్దరు  మహిళా కుస్తీయోధుల పాత్రలను తెర మీద సాన్యా మల్హోత్రా, ఫాతిమా సనా అనే కొత్త తారలు అభినయించారు. వీరి తండ్రిగా ఆమిర్‌ ఖాన్, తల్లిగా టీవీ నటి సాక్షి తన్వర్‌ అభినయించారు.

సినిమాలు డైలాగులు చాలామటుకు హర్యాణ పలుకుబడిలో ఉంటాయి. కొన్ని అర్థం కావు కూడా. అయినా సరే జనం విరగబడి చూస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే హిందీ మార్కెట్‌ పెద్దగా ఉండని తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా దంగల్‌ కలెక్షన్లు కురిపిస్తోంది. తమిళంలో, మలయాళంలో డబ్‌ చేసి విడుదల చేయగా మొదటి మూడు రోజులకు తమిళనాడులో మూడున్నర కోట్లు కేరళలో రెండు కోట్లు వసులు చేసింది. రాబోయే రోజుల్లో ఎన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి.

Advertisement
Advertisement