ఇప్పుడు ఎటు చూసినా సమాజంలో అశాంతి, అభద్రతాభావం రాజ్యమేలుతున్నాయి. ఈ సంక్షోభాలను ఎదుర్కోవాలంటే రాజకీయాలను యువతే శాసించాలి.
ఇప్పుడు ఎటు చూసినా సమాజంలో అశాంతి, అభద్రతాభావం రాజ్యమేలుతున్నాయి. ఈ సంక్షోభాలను ఎదుర్కోవాలంటే రాజకీయాలను యువతే శాసించాలి. దేశభవిష్యత్తు.. కొత్త రాష్ట్రాల భవిష్యత్తు ఉన్నతంగా లిఖించాల్సిన బాధ్యత యువతరంపైనే ఉంది. ఏ దేశమైనా, రాష్ట్రమైనా ముందుకు సాగాలంటే వనరులు, ప్రమాణాలతో కూడిన విద్య అవసరం.. ఇది కొందరికే పరిమితం కాకూడదు.
అందరికీ అందాలి.. యువత ఎప్పటికప్పుడు విద్యారంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని నవసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి.. మరో ముఖ్య విషయం.. స్త్రీ స్వేచ్ఛకు భంగం కలగని సమాజం కావాలి.. అటువంటి సమాజాన్ని సృష్టించే నాయకుడినే ఎన్నుకోవాలి.. యువత తమ ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలి. ఓటు వేయడం మన హక్కే కాదు.. దేశపౌరులుగా మన బాధ్యత కూడా..