తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎం దోస్తీ!! | trs and mim to ally in telangana elections | Sakshi
Sakshi News home page

తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎం దోస్తీ!!

May 19 2014 2:42 PM | Updated on Sep 2 2017 7:34 AM

తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎం దోస్తీ!!

తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎం దోస్తీ!!

భవిష్యత్తులో పెట్టుకోబోయే పొత్తులపై త్వరలోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీల మధ్య చర్చలు జరగనున్నాయని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు.

తెలంగాణలో కలిసి పనిచేయాలని టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి నిర్ణయించుకున్నాయి. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నందున భవిష్యత్తులో పెట్టుకోబోయే పొత్తులపై త్వరలోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీల మధ్య చర్చలు జరగనున్నాయని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. ఎంఐఎం తమకు మిత్రపక్షంగానే ఉంటుందని, తమకు పూర్తి సహకారం అందించేందుకు అసదుద్దీన్ ఒవైసీ అంగీకరించారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తమ రెండు పార్టీలు కలిసి నెరవేఉస్తామని అన్నారు.

ఇక తెలంగాణలో టీఆర్ఎస్కు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వనున్నట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. టీఆర్ఎస్ లౌకికవాద పార్టీ అని, త్వరలో తాము కేసీఆర్ను కలిసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పనిచేసేందుకు రెండు పార్టీలు యోచిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement