బరి తెగించిన టీడీపీ వర్గీయులు | Telugu desam party surrendered YSRCP party seats | Sakshi
Sakshi News home page

బరి తెగించిన టీడీపీ వర్గీయులు

May 8 2014 2:42 AM | Updated on Aug 29 2018 8:56 PM

మైదుకూరు నియోజకవర్గంలో పలుచోట్ల బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు దాడులు చేశారు.

 చాపాడు, న్యూస్‌లైన్: మైదుకూరు నియోజకవర్గంలో పలుచోట్ల బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు దాడులు చేశారు. ఈ దాడులలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డి, నాగిరెడ్డి కార్లు ధ్వంసం కాగా, పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ బుధవారం ఉదయం చాపాడు మండలంలోని వెదురూరు గ్రామంలోకి వెళ్లి ఉద్రిక్తత కల్పించగా ప్రజలు తిరగబడ్డారు. పుట్టా తన కారును తన అనుచరుల చేత పగులగొట్టించుకుని తనపై వైఎస్సార్‌సీపీ వర్గీయులు దాడులు చేసినట్లుగా ప్రచారం చేయించుకున్నారు. పుట్టా తన అనుచరులతో మైదుకూరు మండలంలోని ఎన్.ఎర్రబల్లిలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడున్న వైఎస్సార్‌సీపీ నాయకుడిని పిలిచి అతనిపై దాడులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆదిబోయిన నారాయణయాదవ్ కుటుంబీకులపై దాడులు చేసి, వారి కారు, బైక్‌ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న రఘురామిరెడ్డి తన అనుచరులతో సంఘటనా స్థలానికి చేరుకోగానే టీడీపీ వ ర్గీయులంతా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులలో  జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గుడిపాడు బాబు, ఖాజీపేటకు చెందిన గంగాధర్‌రెడ్డిలు గాయపడ్డారు.
 
 అనంతరం సీఐ వెంకటశివారెడ్డి చర్యలు తీసుకుని పరిస్థితి చక్కబెట్టారు. మధ్యాహ్నం చాపాడు మండలంలోని విశ్వనాథపురంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన రఘురామిరెడ్డి, ఆయన కుమారుడు నాగిరెడ్డిపై తన అనుచరులతో దాడులు చేయించారు. ఈ దాడులలో ఇద్దరికి చెందిన ఇన్నోవా కార్లను ధ్వంసం చేశారు. పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయ్యవారిపల్లెలో వైఎస్సార్‌సీపీ నాయకుడు మునిశేఖర్‌రెడ్డితో టీడీపీ వర్గీయులు వాగ్వాదపడగా మహిళలు అడ్డుకున్నారు. చివరకు పోలీసులు మునిశేఖర్‌రెడ్డిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement