 
															పోలింగ్ సమయం గంట పెంపు: భన్వర్‌లాల్
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మండుటెండలను దృష్టి లో ఉంచుకుని పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ గంట పాటు పెంచిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు.
	రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్
	ఎండల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిర్ణయం
	 
	 సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మండుటెండలను దృష్టి లో ఉంచుకుని పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ గంట పాటు పెంచిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయంగా ఈసీ నిర్ధారించిందన్నారు. గతంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకే పోలింగ్ సమయం ఉండేదని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలివీ..
	 
	  వ్యాపారులు, ఉద్యోగులు ఎవరైనా డబ్బులు తీసుకువెళ్తుంటే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెంట ఉంచుకోవాలి. వివరాలను చూపెట్టినా అనవరసంగా ఎవరైనా వేధిస్తే టోల్ ఫ్రీ 1950 నంబర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.  ఏప్రిల్ 30న పోలింగ్ జరిగే తెలంగాణ జిల్లాల్లోని వారు ఓటు లేకపోతే ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. మే 7న పోలింగ్ జరిగే సీమాంద్ర జిల్లాల్లోని వారు ఓటు లేకపోతే ఏప్రిల్ 9లోగా ఓటుకు దరఖాస్తు చేసుకోవాలి.  ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి 9246280027 నంబర్‌కు ‘వోట్’ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి గుర్తింపు కార్డు నంబర్ ఎస్‌ఎంఎస్ చేయాలి. పేరు ఉంటే ఏ నియోజవర్గంలో ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు ఉందో జవాబు వస్తుంది.  
	 
	 మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిలుపుదల, విద్యుత్ చార్జీల పెంపు, ఉగాది పురస్కారాలకు సంబంధించి ఈసీ నుంచి వివ రణ రాలేదు.  ఓటర్ల న మోదు ప్రత్యేక కార్యక్రమంలో 9.15 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో 6 లక్షల మందికి ఓటు హక్కు కల్పించారు.  రాష్ట్ర ఓటర్లలో విదేశాల్లో ఉన్న ఒక ఎన్నారైకి ఓటు హక్కు ఉంది. పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి సర్వీసు ఓటర్లు 46,110 మంది ఉండగా పురుష ఓటర్లు 34,939 మంది, మహిళా ఓటర్లు 11,171 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 34 లక్షల మందిని తొలగించాం.  7,239 నాన్‌బెయిల్‌బుల్ వారంట్లలో ఇప్పటి వరకు 1050 అమలు చేశారు. వివిధ సీఆర్‌పీసీ సెక్షన్ల కింద 2,363 మందిని అదుపులోకి తీసుకున్నారు. 2,546 ఆయుధాలను డిపాజిట్ చేశారు. 911 ఫ్లయింగ్ స్క్వాడ్స్,  899 చెక్ పోస్టులు, 1142 ఎన్నికల కోడ్ బృందాలు ఏర్పాటయ్యాయి.
	 
	షెడ్యూల్ తర్వాత స్వాధీనం చేసుకున్నవి
	38       కోట్ల రూపాయల నగదు
	19.79    కేజీల బంగారం
	121.26    కేజీల వెండి
	 6,550    లీటర్ల మద్యం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
