ముందు పోస్టల్, ఆ తర్వాత ఈవీఎంలు | Counting starts with postal ballot, after EVMs | Sakshi
Sakshi News home page

ముందు పోస్టల్, ఆ తర్వాత ఈవీఎంలు

May 16 2014 7:23 AM | Updated on Jul 11 2019 8:26 PM

ఎన్నికల ఓట్ల లెక్కింపులో ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు.

హైదరాబాద్ : ఎన్నికల ఓట్ల లెక్కింపులో ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు. కౌంటింగ్ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొనటంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

  పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ ముగియగానే ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఓ రౌండ్ ఫలితం పది నిమిషాల్లోనే వెల్లడి కానుంది. ప్రతి రౌండ్‌లో ర్యాండమ్‌గా రెండు టేబుళ్ల లెక్కింపును సరిచూసిన తర్వాత ఓట్ల వివరాలను షీట్‌లో నమోదు చేస్తారు. ఈ ఏడాది కొత్త విధానం ‘పాడు’ (ప్రింట్ అండ్ ఆక్జలరీ యూనిట్), కంట్రోల్ యూనిట్ ద్వారా ఫలితాలను వెల్లడిస్తారు.  
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement