సొంత రాష్ట్రం హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్కు చుక్కెదురైంది. ఫరీదాబాద్లో ఆయన రోడ్షో ప్రారంభించినప్పుడు కొంతమంది స్థానికులు ఆయనకు నల్లజెండాలు చూపించారు.
సొంత రాష్ట్రం హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్కు చుక్కెదురైంది. ఫరీదాబాద్లో ఆయన రోడ్షో ప్రారంభించినప్పుడు కొంతమంది స్థానికులు ఆయనకు నల్లజెండాలు చూపించారు. ఫరీదాబాద్ లోక్సభా స్థానానికి పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి పురుషోత్తమ్ డాగర్తో కలిసి ఆయన రోడ్ షో ప్రారంభించారు.
అయితే.. ఏ పార్టీతోనూ సంబంధం లేని కొంతమంది స్థానికులు ఆయనకు నల్లజెండాలు చూపించి, ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే, కేజ్రీవాల్కు నల్లజెండాలు చూపించడం ఇదేమీ కొత్తకాదని, ఇంతకుముందు విపక్షాలు కూడా కొన్నిసార్లు ఆయనకు నల్లజెండాలు చూపించాయని, కేజ్రీవాల్ మాత్రమే ఈ దేశాన్ని సరిగా పాలించగలరని ఆమ్ ఆద్మీ మద్దతుదారు ఒకరు అన్నారు.