పారామెడికల్ కోర్సులు.. కౌన్సెలింగ్ వివరాలు | Paramedical courses and Counseling details | Sakshi
Sakshi News home page

పారామెడికల్ కోర్సులు.. కౌన్సెలింగ్ వివరాలు

Nov 13 2014 1:12 AM | Updated on Sep 2 2017 4:20 PM

పారామెడికల్ కోర్సులు.. కౌన్సెలింగ్ వివరాలు

పారామెడికల్ కోర్సులు.. కౌన్సెలింగ్ వివరాలు

జేఎన్‌టీయూహెచ్, కూకట్‌పల్లి; వరంగల్: ఆన్‌లైన్ కౌన్సెలింగ్ సెంటర్, కాకతీయ యూనివర్సిటీ

బీఎస్సీ (నర్సింగ్), బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ), బీఎస్సీ-ఎంఎల్‌టీ (మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ) కోర్సుల్లో  ప్రవేశానికి నిర్వహించే కౌన్సెలింగ్ కోసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కలిపి ఐదు కేంద్రాల్లో ఆన్‌లైన్  విధానంలో ఈ నెల 14 నుంచి 17 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
 
కౌన్సెలింగ్ కేంద్రాలు..
హైదరాబాద్: జేఎన్‌టీయూహెచ్, కూకట్‌పల్లి; వరంగల్: ఆన్‌లైన్ కౌన్సెలింగ్ సెంటర్, కాకతీయ యూనివర్సిటీ; తిరుపతి: ఓల్డ్ ఎంబీఏ బిల్డింగ్, ఎస్వీ యూనివర్సిటీ; విజయవాడ: అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ; విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ, డిస్టెన్స్ స్కూల్ బిల్డింగ్ ఎదురుగా. రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ ఐదు కేంద్రాల్లో ఎక్కడైనా కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు. రెండో విడత నిర్వహించే కౌన్సెలింగ్‌లో వికలాంగుల సీట్లు భర్తీ చేస్తారు.

మెరిట్ కార్డుతో:
బీఎస్సీ (నర్సింగ్), బీపీటీ, బీఎస్సీ(ఎంఎల్‌టీ) కోర్సులకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఎన్టీఆర్ యూనివర్సిటీ వెబ్‌సైట్ (జ్ట్టిఞ://్టటఠజిట.్చఞ.జీఛి.జీ)లో అఫ్లికేషన్ నెంబర్/ రిజిస్ట్రేషన్ నెంబర్/ పేరు నమోదు చేసి మెరిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకొని సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో తెలిపిన విధంగా ఆయా తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి.
 
కావల్సిన సర్టిఫికెట్లు:
దరఖాస్తు కాపీ; రిజిస్ట్రేషన్ కార్డు; మెరిట్ ఆర్డర్ కార్డు; జనన ధ్రువీకరణ పత్రం (ఎస్‌ఎస్సీ/తత్సమాన) క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ (ఇంటర్మీడియెట్) మార్కుల జాబితా; టీసీ (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్); ఆరు నుంచి ఇంటర్మీడియెట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు; తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాల్లో చదివి ఉంటే... తహసీల్దార్/ఎంఆర్‌ఓ జారీ చేసిన పదేళ్ల రెసిడెన్స్ సర్టిఫికెట్; ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులు ఎంఆర్‌ఓ/తహసీల్దార్ జారీ చేసిన శాశ్వత కులధ్రువీకరణ పత్రం, నేటివిటీ సర్టిఫికెట్; గతంలో స్కాలర్‌షిప్ పొంది ఉంటే సంబంధిత కాపీ; 01-01-2014 తర్వాత తహసీల్దార్ జారీ చేసిన తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ పత్రం..; అన్ని సర్టిఫికెట్ల ఒరిజినల్ పత్రాలు, గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేసిన జిరాక్స్ కాపీలను వెంట తెచ్చుకోవాలి.
 
ఫీజులు:
కౌన్సెలింగ్ ఫీజు: రూ.1,000.
ఈ మూడు కోర్సుల్లో ఏదైనా కోర్సులో సీటు పొందిన వర్సిటీ ఫీజు కింద రూ.4,500 కౌన్సెలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన బ్యాంకు కౌంటర్‌లో చెల్లించాలి.
బీఎస్సీ ఎంఎల్‌టీ (కోర్సు వ్యవధి-మూడేళ్లు): స్పెషల్ ఫీజు కింద మొదటి సంవత్సరం రూ.6,500, మిగిలిన రెండేళ్లు రూ.4,500 చొప్పున కళాశాలల్లో చెల్లించాలి.
బీపీటీ (కోర్సు వ్యవధి-నాలుగున్నరేళ్లు): స్పెషల్ ఫీజు మొదటి సంవత్సరం రూ.13,500, మిగిలిన మూడేళ్లు రూ.8,500 చొప్పున కళాశాలలో చెల్లించాలి.
బీఎస్సీ(నర్సింగ్-కోర్సు వ్యవధి-నాలుగేళ్లు): స్పెషల్ ఫీజు మొదటి సంవత్సరం రూ.16,500, మిగిలిన మూడేళ్లు రూ.10,000. చొప్పున చెల్లించాలి.
ఈ మూడు కోర్సుల్లో స్పెషల్ ఫీజులు కాకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన విధంగా ట్యూషన్ ఫీజులను ఆయా కళాశాలల్లో చెల్లించాలి.
పభుత్వ నిబంధనల ప్రకారం ఆయా వర్గాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సదుపాయం ఉంది.
కాలేజీల సంఖ్య:
కోర్సు    ప్రభుత్వ    ప్రైవేట్
బీఎస్సీ నర్సింగ్    12    196
బీపీటీ    -    38
బీఎస్సీ ఎంఎల్‌టీ    10    44
(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కలిపి కాలేజీల సంఖ్య)
వివరాలకు: http://ntruhs.ap.nic.in
 
-రాజ్‌కుమార్ ఆలూరి, న్యూస్‌లైన్, విజయవాడ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement