టీటీకే అంబాసిడర్‌లుగా ఐశ్వర్య, అభిషేక్ | aiswarya and abhisheik are the brand ambassdors to ttk prestige | Sakshi
Sakshi News home page

టీటీకే అంబాసిడర్‌లుగా ఐశ్వర్య, అభిషేక్

Oct 1 2013 1:24 AM | Updated on Sep 1 2017 11:12 PM

టీటీకే అంబాసిడర్‌లుగా ఐశ్వర్య, అభిషేక్

టీటీకే అంబాసిడర్‌లుగా ఐశ్వర్య, అభిషేక్

గృహోపకరణాలు తయారు చేసే టీటీకే ప్రెస్టీజ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఐశ్వర్య, ఆమె భర్త అభిషేక్ బచ్చన్‌లు వ్యవహరించనున్నారు. ఈ


 చెన్నై: గృహోపకరణాలు తయారు చేసే టీటీకే ప్రెస్టీజ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఐశ్వర్య, ఆమె భర్త అభిషేక్ బచ్చన్‌లు వ్యవహరించనున్నారు. ఈ మేరకు వారితో ఒప్పందం కుదుర్చుకున్నామని టీటీకే గ్రూప్‌కు చెందిన టీటీకే ప్రెస్టీజ్ పేర్కొంది. వీరి వల్ల గృహోపకరణాల మార్కెట్లో తమ అగ్రస్థానం మరింత పటిష్టమవుతుందని టీటీకే ప్రెస్టీజ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టి.టి.జగన్నాథన్ పేర్కొన్నారు. బ్రాండ్ అంబాసిడర్ ఎండార్స్‌మెంట్ కారణంగా తమ బ్రాండ్ ఉన్నత శిఖరాలకు చేరుతుందని శ్రీనివాసన్ రవిచంద్రన్ వివరించారు. వీరిద్దరితో కలిసి ఆరు కొత్త టీవీ కమర్షియల్స్‌ను రూపొందించామని, ప్రింట్ మీడియాలో కూడా ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. కంపెనీ ప్రెషర్ కుకర్స్, నాన్‌స్టిక్ కుక్‌వేర్స్, గ్యాస్‌స్టవ్‌లు, విద్యుత్ గృహోపకరణాలను విక్రయిస్తోంది.
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement