వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు చింతా కృష్ణమూర్తి బుధవారం కన్నుమూశారు.
రాజమండ్రి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు చింతా కృష్ణమూర్తి బుధవారం కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందారు. చింతా కృష్ణమూర్తి మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణమూర్తి కుటుంబసభ్యులను వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు.