వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి | YSR CP district president apointed Bembadi Srinivas Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి

Jun 11 2016 2:59 AM | Updated on May 25 2018 9:20 PM

వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి - Sakshi

వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి

వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా కుత్బుల్లాపూర్ నియోజవకర్గం కొంపల్లి గ్రామానికి చెందిన బెంబడి శ్రీనివాస్‌రెడ్డిని

కుత్బుల్లాపూర్: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా కుత్బుల్లాపూర్ నియోజవకర్గం కొంపల్లి గ్రామానికి చెందిన బెంబడి శ్రీనివాస్‌రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్‌రెడ్డి ఆది నుంచి దివంగత వైఎస్సార్ అనుచరుడిగా కొనసాగుతూ వచ్చారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  ఆధ్వర్యంలో ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీలో ఆయన క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.  పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టు  కుంటానని, జిల్లా వ్యాప్తంగా అన్ని  మండలాల్లో పార్టీని బలోపేతం  చేస్తానని శ్రీనివాస్‌రెడ్డి  ‘సాక్షి’తో అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement