వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ నెల 4న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 4వ తేదీన నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కస్తూరిదేవి గార్డెన్స్లో యువభేరి సదస్సుకు ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఈనెల 1వ తేదీనే వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే ఆ పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే.