ప్రజల గుండెల్లో వైఎస్‌ చెరగని ముద్ర | YS in People Heart | Sakshi
Sakshi News home page

ప్రజల గుండెల్లో వైఎస్‌ చెరగని ముద్ర

Jul 24 2016 9:47 PM | Updated on Jul 7 2018 2:56 PM

మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు - Sakshi

మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

మిడ్జిల్‌: ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారని వైఎస్సార్‌సీపీ మైనారిటీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు హైదర్‌అలీ అన్నారు.

మిడ్జిల్‌ : ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారని వైఎస్సార్‌సీపీ మైనారిటీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు హైదర్‌అలీ అన్నారు. ఆదివారం మిడ్జిల్‌లో నిర్వహించిన  పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్‌ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కషి చేయాలన్నారు. పార్టీ పటిష్టానికి కార్యకర్తలు, నాయకులు ముందుండాలన్నారు. వైఎస్‌ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ జడ్చర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి మరియమ్మ, పార్టీ నాయకులు రాంమోహన్, రామకష్ణారెడ్డి, రాఘవేందర్, అనిల్‌గౌడ్, సలీం తదితరులు పాల్గొన్నారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement