రైలు ఎక్కుతుండగా జారిపడి యువకుడి మృతి


కర్నూలు(వెల్దుర్తి): రైలు ఎక్కుతుండగా జారిపడి యువకుడు మృతిచెందిన సంఘటన వెల్దుర్తి రైల్వే స్టేషన్ లో ఆదివారం ఉదయం జరిగింది. వెల్దుర్తి పట్టణానికి చెందిన మాలిక్(22) అనే యువకుడు కర్నూలులోని ఓ మిత్రుడి ఇంట్లో పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top