కర్నూలు నగరం సోమిశెట్టి నగర్‌లో నివాసం ఉంటున్న జంబులయ్య కూతురు బోయ యామిని (29) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
యువతి ఆత్మహత్య
Mar 4 2017 12:23 AM | Updated on Nov 6 2018 7:53 PM
కర్నూలు: కర్నూలు నగరం సోమిశెట్టి నగర్‌లో నివాసం ఉంటున్న జంబులయ్య కూతురు బోయ యామిని (29) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. జంబులయ్య లైబ్రరీయన్‌గా పని చేస్తూ పదవీవిరమణ పొందాడు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు సంతానం. కూతురు యామిని ఎమ్మెస్సీ, బీఈడీ, ఎంఏ ఇంగ్లీష్ వరకు చదువకుంది. నగరంలోని గుడ్‌షెప్పర్డ్ స్కూలులో టీచర్‌గా పని చేస్తుంది. కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి సంబం«ధాలు చూస్తున్నప్పటికీ కుదరకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. దీనికి తోడు నాలుగేళ్లుగా పార్శ్యనొప్పి (మైగ్రేన్)తో బాధపడుతుండేది. గురువారం రాత్రి 9గంటల సమయంలో పార్శ్యనొప్పి తీవ్రం కావడంతో ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసుకొని స్కిప్పింగ్ తాడుతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొంది.కొద్ది సేపటి తర్వాత కుటుంబ సభ్యులు కిటికీలో నుంచి గమనించారు. రోకలి బండతో తలపులను బద్దలుకొట్టి ఆమెను ఉరి నుంచి తప్పించి, ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. శుక్రవారం మధ్యాహ్నం కోలుకోలేక చనిపోయింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మూడో పట్టణ సీఐ మధుసూదన్‌రావు తెలిపారు.
Advertisement
Advertisement