వివాహిత ఆత్మహత్య | women suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Nov 11 2016 1:14 AM | Updated on Sep 4 2017 7:44 PM

వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య

స్థానిక పడమటి వీధిలో నివాసం ఉండే కాలహస్తి నాగరాజు భార్య లక్ష్మిదేవి(42) గురువారం ఇంటిలోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

చెన్నూరు : స్థానిక పడమటి వీధిలో నివాసం ఉండే కాలహస్తి నాగరాజు భార్య లక్ష్మిదేవి(42) గురువారం  ఇంటిలోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ కథనం మేరకు...ప్రొద్దుటూరుకు చెందిన ఈమె 24ఏళ్ల క్రితం నాగరాజుతో వివాహమైంది. నాగరాజు ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తూ, స్థానిక సాయిబాబా గుడిలో పూజారిగా ఉండేవాడు. పాఠశాలకు వెళ్లడంతో ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని మృతి చెందింది. స్థానికులు గమనించి తలుపులు పగులగొట్టి తీయగా అప్పటికే మృతి చెందింది. మృతి కారణం సంతానం కలుగలేదని, అనారోగ్యం వల్లే నంటూ బంధువులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement