చికిత్సపొందుతున్న వివాహిత మృతి | women died under treatment | Sakshi
Sakshi News home page

చికిత్సపొందుతున్న వివాహిత మృతి

Aug 20 2016 9:47 PM | Updated on Sep 28 2018 3:41 PM

అమీనాబాద్‌(కోదాడరూరల్‌): కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న వివాహిత మహిళ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.

అమీనాబాద్‌(కోదాడరూరల్‌): కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న వివాహిత మహిళ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.  రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని అమీనాబాద్‌ గ్రామానికి చెందిన మీసాల నాగమణి (30)కి కొద్ది రోజులుగా మతిస్థిమితం సరిగా లేదు. దీంతో పాటు ఇటీవల ఆమె అనారోగ్యం పాలయింది. దీంతో శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రపోయిన తర్వాత ఆమె ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. గమణించిన ఆమె భర్త శ్రీను, తమ్ముడు రవి మంటలు ఆర్పే క్రమంలో స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రగాయాల పాలైన ఆమెను ఖమ్మం వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. మృతురాలి తమ్ముడు కిన్నెర రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్‌ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement