మైలవరం జలాశయం ఉత్తర కాలువకు నీరు విడుదల | Water Released In Milavaram North Canal | Sakshi
Sakshi News home page

మైలవరం జలాశయం ఉత్తర కాలువకు నీరు విడుదల

Nov 4 2016 11:17 PM | Updated on Oct 1 2018 2:09 PM

మైలవరం జలాశయం ఉత్తర కాలువకు నీరు విడుదల - Sakshi

మైలవరం జలాశయం ఉత్తర కాలువకు నీరు విడుదల

మైలవరం జలాశయం ఉత్తర కాలువకు శుక్రవారం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి నీటిని విడుదల చేశారు.

మైలవరం: మైలవరం జలాశయం ఉత్తర కాలువకు శుక్రవారం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండుతున్న పంటలను కాపాడేందుకు నీటిని విడుదల చేస్తున్నామని, రైతులు పైరుకు తగ్గట్టుగా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. రైతులు ఫసల్‌ బీమా యోజనను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం జలాశయంలో 0.947 టీఎంసీల నీరుందని, అధికారుల ఆదేశాల మేరకు 7 రోజుల పాటు ఉత్తర కాలువకు నీరు విడుదల చేస్తామని ఏఈ గౌతమ్‌రెడ్డి తెలిపారు. రోజుకు 200 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో ఈఈ సుధాకర్, డీఈ రామాంజులు, టీబీహెచ్‌ఎల్‌సీ చైర్మన్‌ శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement