వాలీబాల్‌ జిల్లా మహిళా జట్లు ఎంపిక | volleyball district womens teams selection | Sakshi
Sakshi News home page

వాలీబాల్‌ జిల్లా మహిళా జట్లు ఎంపిక

Oct 1 2016 10:39 PM | Updated on Sep 4 2017 3:48 PM

వాలీబాల్‌ జిల్లా మహిళా జట్లు ఎంపిక

వాలీబాల్‌ జిల్లా మహిళా జట్లు ఎంపిక

కొవ్వూరు : జిల్లా వాలీబాల్‌ అసోసియోషన్‌ పర్యవేక్షణలో కొవ్వూరులో గౌతమీ స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం జిల్లా మహిళా విభాగం సీనియర్, యూత్‌ మహిళా జట్లను ఎంపిక చేశారు.

కొవ్వూరు : జిల్లా వాలీబాల్‌ అసోసియోషన్‌ పర్యవేక్షణలో కొవ్వూరులో గౌతమీ స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం జిల్లా మహిళా విభాగం సీనియర్, యూత్‌ మహిళా జట్లను ఎంపిక చేశారు. ఎంపికైన జట్లు ఈ నెల 6,7,8,9 తేదీల్లో నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని అసోసియోషన్‌ అధ్యక్షుడు పరిమి హరిచరణ్‌ తెలిపారు. అసోసియేషన్‌ కార్యదర్శి సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్‌(చిన్ని) పాల్గొన్నారు. 
జాతీయస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక 
దేవరపల్లి: జాతీయస్థాయి ఉమెన్‌ ఫుట్‌బాల్‌ పోటీలకు జిల్లా విద్యార్థినులు ఎంపికైనట్టు జిల్లా జట్టు కోచ్‌ కె.వి.డి.వి.ప్రసాద్‌ శనివారం దేవరపల్లిలో తెలిపారు. ఇటీవల తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు 3వ స్థానం సాధించిందన్నారు. ఎం.నీరజ(దేవరపల్లి), చెరిమళ్ల సుభద్ర(కొయ్యలగూడెం), బాలుర విభాగంలో కట్టా వెంకటేశ్‌(నిడదవోలు) జాతీయ పోటీలకు ఎంపికైనట్టు చెప్పారు. 
కొయ్యలగూడెం నుంచి.. 
కొయ్యలగూడెం : జాతీయ స్థాయి ఉమెన్‌ పుట్‌బాల్‌ పోటీలకు స్థానిక వీఎస్‌ఎన్‌ కళాశాలకు చెందిన విద్యార్థిని సీహెచ్‌ సుభద్ర ఎంపికైనట్టు ప్రిన్సిపాల్‌ వీఎస్‌ఎన్‌స్వామి శనివారం తెలిపారు. ఇటీవల తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ పోటీల్లో ఈమె ప్రతిభ చూపినట్టు తెలిపారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement