ప్రబలిన విషజ్వరాలు.. | Viral fevers in adilabad district | Sakshi
Sakshi News home page

ప్రబలిన విషజ్వరాలు..

Aug 4 2015 1:11 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలం ఏదూలసంఘం గ్రామంలో విష జ్వరాలు ప్రబలాయి.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలం ఏదూలసంఘం గ్రామంలో విష జ్వరాలు ప్రబలాయి. మంగళవారం నాటికి దాదాపు 50 మందికిపైగా గ్రామస్తులు విష జ్వరాలతో బాధపడుతున్నారు. కాగా, వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గత మూడు రోజులుగా  గ్రామంలో విష జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారు.

దీంతో ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి ఫిర్యాదు చేసింది. దాంతో ఏదూలసంఘం గ్రామంలోని ప్రజలుకు తక్షణం వైద్య సేవలు అందించాలని ప్రాజెక్టు అధికారి వైద్య అధికారులను ఆదేశించారు. దాంతో వారు గ్రామానికి చేరుకుని వైద్య సేవలు అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement