బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి: ఉపసర్పంచ్ మృతి | vice president dies of bonala celebrations in chinthulla | Sakshi
Sakshi News home page

బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి: ఉపసర్పంచ్ మృతి

Sep 6 2015 8:46 PM | Updated on Mar 28 2018 11:11 AM

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతుల్ల గ్రామంలో ఆదివారం జరిగిన బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది.

యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతుల్ల గ్రామంలో ఆదివారం జరిగిన బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఉప సర్పంచ్ మక్కు కృష్ణ (30) మృత్యువాత పడ్డారు. ఆదివారం సాయంత్రం ఉత్సవాల సందర్భంగా విద్యుత్ తీగల నుంచి విద్యుత్ తీసుకునేందుకు వైర్ వేస్తుండగా షాక్ కొట్టడంతో కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement