వెంకయ్యస్వామి అరాధన ఉత్సవాలు ప్రారంభం | Venkaiahswamy fest starts | Sakshi
Sakshi News home page

వెంకయ్యస్వామి అరాధన ఉత్సవాలు ప్రారంభం

Aug 19 2016 12:39 AM | Updated on Sep 4 2017 9:50 AM

వెంకయ్యస్వామి అరాధన ఉత్సవాలు ప్రారంభం

వెంకయ్యస్వామి అరాధన ఉత్సవాలు ప్రారంభం

వెంకటాచలం: గొలగమూడిలోని భగవాన్‌ శ్రీ వెంకయ్యస్వామి 34వ ఆరాధన మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

 
  •  సర్వభూపాల వాహనంపై విహరించిన స్వామివారు 
వెంకటాచలం: గొలగమూడిలోని భగవాన్‌ శ్రీ వెంకయ్యస్వామి 34వ ఆరాధన మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నిత్యపూజ అనంతరం గణపతి పూజ, స్వస్తి వాచనము, అంకురార్పణ, దీక్షావస్త్రధారణ, కంకణధారణ, కలశస్థాపన, శిఖర సంప్రోక్షణలతో ఉత్సవాలు మొదలయ్యాయి. మొదటిరోజు సర్వభూపాల వాహనంపై విశేష పుష్పాలంకరణతో కొలువుదీరిన వెంకయ్యస్వామి మంగళవాయిద్యాల, ఓంనారాయణ..ఆదినారాయణ నామస్మరణ మధ్య గొలగమూడి వీధుల్లో విహరించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. సర్వభూపాల వాహనసేవకు ఉభయకర్తలుగా గొలగమూడి వాసులు వ్యవహరించారు. ఏర్పాట్లును ఆశ్రమ కార్యనిర్వాహణాధికారి బాలసుబ్రహ్మణ్యం  పర్యవేక్షించారు.
ఉత్సవాల్లో నేడు 
ఆరాధనోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం హనుమంత సేవ నిర్వహించనున్నారు. రాత్రి 9గంటలకు  చంద్రప్రభ వాహనసేవ నిర్వహిస్తారు. అనంతరం శ్రీరామాజంనేయ యుద్ధం వార్‌సీను, గయోపాఖ్యానం వార్‌సీను, శ్రీ వీరబ్రహ్మంద్రస్వాముల వారి సమాధిసీను, సత్యహరిశ్చంద్ర కాటిసీను నాటకాలు ప్రదర్శించనున్నారు.

Advertisement

పోల్

Advertisement