'సీఎంను అవమానించేలా వెంకయ్య వ్యాఖ్యలు' | venkaiah naidu comments insulted CM, says Raghuveera | Sakshi
Sakshi News home page

'సీఎంను అవమానించేలా వెంకయ్య వ్యాఖ్యలు'

Aug 21 2015 1:59 PM | Updated on Aug 29 2018 6:00 PM

'సీఎంను అవమానించేలా వెంకయ్య వ్యాఖ్యలు' - Sakshi

'సీఎంను అవమానించేలా వెంకయ్య వ్యాఖ్యలు'

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తాను లేకపోతే దిక్కులేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. వెంకయ్య వ్యాఖ్యలు ప్రజలను నిరాశపరిచేలా, ముఖ్యమంత్రిని అవమానించేలా ఉన్నాయని అన్నారు.

విదేశీ సంస్థలకు ధారాదత్తం చేసేందుకే చంద్రబాబు భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాని రఘువీరా డిమాండ్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement