
వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా నగరంలోని పలు ఆలయాలు గోకులంగా మారాయి. చిన్నారుల ఆటపాటలతో హోరెత్తాయి.
అనంతపురం కల్చరల్: కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా నగరంలోని పలు ఆలయాలు గోకులంగా మారాయి. చిన్నారుల ఆటపాటలతో హోరెత్తాయి. మంగళవారం రాత్రి స్థానిక గీతామందిరంలో సంస్థ అధ్యక్షుడు బీఎస్‌ఎన్‌ఎల్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో వందలాది మంది చిన్నారులు కృష్ణవేషధారణలో సందడి చేశారు. ఉట్టి ఉత్సవం సంబరంగా జరిగింది. దశావతారాల ప్రదర్శన, భక్తి సంగీత కచేరి ఆహూతులను అలరించాయి. ఎస్కేయూ రిజిస్ట్రార్ సుధాకర్‌బాబు, మునిసిపల్ కమిషనర్ సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథులుగా విచ్చేసి చిన్నారులకు బహుమతులు అందించారు.