లారీ-ఆటో ఢీ: విద్యార్థులు మృతి | two students killed in road accident in guntur district | Sakshi
Sakshi News home page

లారీ-ఆటో ఢీ: విద్యార్థులు మృతి

Jul 31 2016 8:34 AM | Updated on Aug 30 2018 4:07 PM

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం దోచిపర్రు వద్ద ఆదివారం లారీ - ఆటో ఢీకొన్నాయి.

గుంటూరు : గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం దోచిపర్రు వద్ద ఆదివారం లారీ - ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. విద్యార్థుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement