కారు, బైక్ ఢీ: ఇద్దరి పరిస్థితి విషమం | Two seriously injured in a road accident | Sakshi
Sakshi News home page

కారు, బైక్ ఢీ: ఇద్దరి పరిస్థితి విషమం

Apr 21 2016 10:19 AM | Updated on Aug 30 2018 4:07 PM

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ పరిధిలోని శ్రీశైలం హైవేపై కారు, బైక్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ పరిధిలోని శ్రీశైలం హైవేపై కారు, బైక్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా చెట్టుపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన కొడుకును హైదరాబాద్‌లో జరిగే పాలిసెట్ రాయించేందుకు బైక్‌పై బయలుదేరాడు. వారి వాహనాన్ని అవేర్ గేట్ వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది.

 

ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడి, స్పృహ కోల్పోయారు. అలాగే, కారులో ఉన్న ఇద్దరిలో ఒక మహిళ తీవ్ర గాయాలపాలైంది. అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురినీ 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. తండ్రి, కొడుకు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement