ఇద్దరు మోటార్‌సైకిల్‌ దొంగల అరెస్ట్‌ | two motor cycle thiefs arrest | Sakshi
Sakshi News home page

ఇద్దరు మోటార్‌సైకిల్‌ దొంగల అరెస్ట్‌

Jan 12 2017 9:06 PM | Updated on Sep 2 2018 5:06 PM

ఇద్దరు మోటార్‌సైకిల్‌ దొంగల అరెస్ట్‌ - Sakshi

ఇద్దరు మోటార్‌సైకిల్‌ దొంగల అరెస్ట్‌

జంగారెడ్డిగూడెం : స్థానిక స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద రెండు రోజులు వరుసగా రెండు మోటార్‌ సైకిళ్లు దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై ఎం.కేశవరావు తెలిపారు.

జంగారెడ్డిగూడెం : స్థానిక స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద రెండు రోజులు వరుసగా రెండు మోటార్‌ సైకిళ్లు దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై ఎం.కేశవరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. యడ్లపల్లి శ్రీను అనే వ్యక్తి ఈనెల 9న స్థానికి ఎస్‌బీఐ బయట మోటార్‌ సైకిల్‌ ఉంచి బ్యాంకులోకి వెళ్లి వచ్చేసరికి అతని మోటార్‌సైకిల్‌ చోరీకి గురైంది. అలాగే 10న బేతపూడి జాన్‌ చౌదరి మోటార్‌సైకిల్‌ కూడా ఇలాగే చోరీకి గురైంది. ఈ రెండు మోటార్‌సైకిళ్లను చోరీ చేసిన పట్టణానికి చెందిన అల్లాడి వీరన్న, తెల్లపల్లి ప్రసాద్‌ను గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రెండు మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే నిందితులు తెలంగాణ రాష్ట్రం దమ్మపేటకు చెందిన మరో మోటార్‌సైకిల్‌ కూడా దొంగిలించినట్టు అంగీకరించారని ఎస్సై తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement