కొక్కంటిక్రాస్ చెక్‌పోస్ట్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి.
తనకల్లు : కొక్కంటిక్రాస్ చెక్‌పోస్ట్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.... కర్ణాటకలోని చాకివేలు దగ్గర సద్దలోల్లపల్లికి చెందిన వెంకటరమణ, నరసింహులు గాండ్లపెంట మండలం ముక్కలోల్లపల్లికి ద్విచక్ర వాహనంలో బయలు దేరారు. గ్రామంలోని తమ బంధువులతో మాట్లాడిన తరువాత తిరిగి స్వగ్రామానికి పయనమయ్యారు.
తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ చెక్‌పోస్టు వద్ద సరిగ్గా చెక్‌పోస్టు వద్దకు రాగానే నారేవాండ్లపల్లి నుంచి వస్తున్న ట్రాక్టర్ వీరి ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరమణ, నరసింహులుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రులను కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.