గూళ్యం రథోత్సవాల్లో ఇరువర్గాల మధ్య ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది
ఇరువర్గాల ఘర్షణ
Mar 6 2017 12:13 AM | Updated on Oct 2 2018 6:46 PM
	- ఒకరికి గాయాలు
	 
	 
					
					
					
					
						
					          			
						
				
	- ఐదుగురిపై కేసు నమోదు 
	హాలహర్వి : గూళ్యం రథోత్సవాల్లో ఇరువర్గాల మధ్య ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరు గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. గూళ్యం గ్రామంలో జరుగుతున్న గాదిలింగేశ్వరుడు రథోత్సవాల సందర్భంగా స్వామివారి దర్శనం కోసం వచ్చిన జె.హోసళ్లి గ్రామానికి చెందిన భీమన్నపై బళ్లారి జిల్లా బెణకల్‌కు చెందిన పరమేష్, బసవరాజు, రామకృష్ణ, రాముడు, దొబ్బురవాహన దాడి  చేశారు. తోపులాటలో భీమన్న కాలుతొక్కాడంటూ వాగ్వాదానికి దిగారు. మాటమాట పెరగడంతో దాడి చేయడంతో భీమన్న గాయపడ్డాడు.  బాధితుడి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు. 
Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
