ఇద్దరు నిందితుల అరెస్టు | two accuses arrest | Sakshi
Sakshi News home page

ఇద్దరు నిందితుల అరెస్టు

Feb 26 2017 12:14 AM | Updated on Aug 25 2018 6:21 PM

చెడు వ్యసనాలకు అలవాటు పడి ఛీటింగ్‌ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

పెద్దపప్పూరు (తాడిపత్రిరూరల్‌) : చెడు వ్యసనాలకు అలవాటు పడి ఛీటింగ్‌ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని ముచ్చుకోట గ్రామ సమీపంలో వారం రోజుల క్రితం పోలీస్‌ ‍డ్రెస్‌ వేసుకుని వాహనదారుల నుంచి డబ్బు వసూలు చేసిన షేక్‌పల్లికి చెందిన ఆదినారాయణరెడ్డిని, నారపురానికి చెందిన కాకార్ల రంగనాయకులును ముచ్చుకోట సమీపంలోనే అరెస్టు చేసినట్లు పెద్దపప్పూరు ఎస్‌ఐ శ్రీహర్ష శనివారం విలేకరులకు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1,30,000లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement