‘మార్చ్ టు పార్లమెంట్’ లో టీఎస్‌యూటీఎఫ్ సభ్యులు | TSUTD Members in March to Parliament | Sakshi
Sakshi News home page

‘మార్చ్ టు పార్లమెంట్’ లో టీఎస్‌యూటీఎఫ్ సభ్యులు

Dec 31 2016 3:39 AM | Updated on Sep 4 2017 9:27 PM

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ‘‘మార్చ్ టు పార్లమెంట్’’

మెదక్ మున్సిపాలిటీ: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ‘‘మార్చ్ టు పార్లమెంట్’’ కార్యక్రమంలో తెలంగాణ యూటీఎఫ్ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ఎస్‌టీఎఫ్‌ఐ అనుబంధ సంఘాల ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొన్నట్లు యూటీఎఫ్ మెదక్ కోశాధికారి ఎన్.సుధాకర్ తెలిపారు.  సీపీఎస్ రద్దుపై తమ నినాదాలన్ని గట్టిగా వినిపించినట్లు పేర్కొన్నారు. కాగా తెలంగాణ వెరుు్య మంది,  ఏపీ నుండి 3వేల మంది పాల్గొన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు  నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చావ రవి, మెదక్ జిల్లా యూటీఎఫ్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, ప్రధాన కార్యదర్శి పద్మారావు, అజయ్, రాందాస్, మల్లేశం, సుధాకర్, ఫయాజ్, రవీందర్‌రెడ్డి, బీమ్లా, హరిబాబు, తిరుపతి, కృష్ణ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement