 
															దొంగల చేతిలో ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం
మండల పరిధిలోని కదిరి- హిందూపురం ప్రధాన రహదారిలోని చింతమానుపల్లి సమీపంలో వ్యవసాయ బోర్లకు ఏర్పాటు...
	గోరంట్ల : మండల పరిధిలోని కదిరి- హిందూపురం ప్రధాన రహదారి లోని చింతమానుపల్లి సమీపంలో వ్యవసాయ బోర్లకు ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు  సోమవారం రాత్రి ధ్వంసం చేసి , రాగి వైరును చోరీ చేశారు. 25కెవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేయడంతో అందులో ఉన్న సుమారు 60 లీటర్ల మేర ఆయిల్ కింద పారబోసి,  ట్రాన్స్‌ఫార్మర్‌లో అమర్చిన  55కిలోల రాగి తీగలను తీసుకె ళ్లిపోయారు.
	
	దీంతో రూ. 24 వేలరూపాయల మేర ఆస్ధినష్టంతో పాటు  బోరుకింద సుమారు 5 ఎకరాల్లో స్ప్రింక్లర్ల సౌకర్యంతో సాగు చేసిన వేరుశనగ పంట దెబ్బతినే ప్రమాదం ఉందని బాధిత రైతు చింతమానుపల్లి ముత్యాలప్ప తెలిపారు. ఈ మేరకు ఆయన కుటుంబసభ్యులు మంగళవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
