
చిన్నారిని చిదిమేసిన ట్రాక్టర్
అప్పటి దాకా తల్లి చేతిలో ఆడుకున్న చిన్నారి కళ్లముందే ట్రాక్టర్ కింద పడి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన బుధవారం సాయంత్రం మండల కేంద్రం కొలిమిగుండ్లలోని జ్వాల కాంప్లెక్స్ ఎదురుగా చోటు చేసుకుంది.
కొలిమిగుండ్ల: అప్పటి దాకా తల్లి చేతిలో ఆడుకున్న చిన్నారి కళ్లముందే ట్రాక్టర్ కింద పడి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన బుధవారం సాయంత్రం మండల కేంద్రం కొలిమిగుండ్లలోని జ్వాల కాంప్లెక్స్ ఎదురుగా చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిన్న పెద్దరాజు, రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు మనోజ్(3) సంతానం. బంధువులకు కొత్త దుస్తులు పెట్టడంతో వారిని ఊరికి సాగనంపేందుకు కుమారుడితో కలసి ఆర్టీసీ బస్టాండ్ వద్దకు వెళ్తూ కాంప్లెక్స్ ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నారు. అదే సమయంలో బనగానపల్లె నుంచి తాడిపత్రి వైపునకు ఎరువును తీసుకెళ్తున్న ట్రాక్టర్ బాలుడిని ఢీకొంది. చికిత్స నిమిత్తం స్థానిక ప్రవేట్ వైద్యశాలకు తరలిస్తుండగా మృత్యువాత పడ్డాడు. కుమారుడి మృతితో తల్లితండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.