స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో అండర్–19 జిల్లా స్థాయి జూనియర్ కళాశాలల బాలబాలికలకు ఈనెల 19వ తేదీన వివిధ క్రీడాంశాల్లో ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా నిర్వహణ కార్యదర్శి కోట సతీష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రేపు ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు
Aug 18 2016 12:24 AM | Updated on Sep 4 2017 9:41 AM
వరంగల్ స్పోర్ట్స్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో అండర్–19 జిల్లా స్థాయి జూనియర్ కళాశాలల బాలబాలికలకు ఈనెల 19వ తేదీన వివిధ క్రీడాంశాల్లో ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా నిర్వహణ కార్యదర్శి కోట సతీష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే ఎంపికల్లో పాల్గొనే విద్యార్థులు ఉదయం 9 గంటలకు పదో తరగతి మెమో, కాలేజీ ఐడీతో హాజరుకావాలన్నారు. ఖోఖో, క్యారమ్స్, రెజ్లింగ్, ఫుట్‌బాల్, టెన్నిస్‌బాల్, క్రికెట్, సర్కిల్ కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, రైల్ షూటింగ్, సూపర్‌సెవెన్ క్రికెట్, టెన్నిస్ క్రీడల్లో ఎంపికలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Advertisement