ఈ నెల 5 వ తేదీన స్థానిక బి. క్యాంపు క్రీడా మైదానంలో జిల్లా స్థాయి సీనియర్ మహిళా హ్యాండ్‌బాల్ జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం కార్యదర్శి సి. రామాంజనేయులు శనివారం ప్రకటనలో తెలిపారు.
రేపు జిల్లా మహిళా హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక
Dec 4 2016 12:00 AM | Updated on Sep 4 2017 9:49 PM
కర్నూలు (టౌన్): ఈ నెల 5 వ తేదీన స్థానిక బి. క్యాంపు క్రీడా మైదానంలో జిల్లా స్థాయి సీనియర్ మహిళా హ్యాండ్‌బాల్ జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం కార్యదర్శి సి. రామాంజనేయులు శనివారం ప్రకటనలో తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 13, 14 తేదీలలో విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి మహిళా హ్యాండ్ బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని తెలిపారు. జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు రూ.10 దరఖాస్తు రుసుం చెల్లించాలన్నారు. వివరాలకు సెల్: 9393 827 585 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
Advertisement
Advertisement